
210views
బిహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు – అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. ఛప్రా జిల్లాకు చెందిన కమల్‌సింగ్‌కు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరూ అమ్మాయిలేనని బంధువులు మాటలతో మానసిక వేదనకు గురిచేసేవారు. దీంతో ఆయన స్వగ్రామం వీడి, ఛప్రా జిల్లా ఎక్మాకు వచ్చి స్థిరపడ్డాడు. వ్యవసాయం చేసుకొంటూ ఇంటి వద్ద పిండి గిర్నీ నడిపేవాడు. ఏడుగురు ఆడపిల్లలను చక్కగా చదివించాడు. అక్కాచెల్లెళ్లు అందరూ బిహార్ పోలీసుశాఖలో, వివిధ కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగాల్లో స్థిరపడ్డ ఈ ఏడుగురు తల్లిదండ్రులకు, తమ్ముడు రాజీవ్‌సింగ్‌కు ఛప్రాలోని ఎక్మా బజార్‌లో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించి కానుకగా ఇచ్చారు. ప్రతినెలా వచ్చే అద్దెలతో హాయిగా బతుకుతున్నట్లు కమల్‌సింగ్, శారదాదేవి దంపతులు అంటున్నారు.





