News

కల్యాణ తలంబ్రాలకు విరాళం

182views

భద్రాచలం రామాలయంలో ఏప్రిల్‌ 17న నిర్వహించే శ్రీరామ నవమి కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాల బియ్యాన్ని అందించడం సంతోషంగా ఉందని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవాసమితి అధ్యక్షుడు ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ అన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి సేకరించిన 12,800 కిలోల బియ్యాన్ని ఆదివారం ఈఓ రమాదేవి ద్వారా రాములవారికి సమర్పించారు. సుదీర్ఘ కాలం రామ సేవలో తరిస్తున్న ఈ భక్త బృందానికి వేద పండితుడు ప్రసాద అవధాని నేతృత్వంలో ఆశీర్వచనం అందించారు. ఆలయ సూపరింటెండెంట్‌ నిరంజన్‌ పాల్గొన్నారు.