
316views
ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెళ్లనున్నారు. అక్కడ భారత సైనికులతో హోలీ పండగ జరుపుకుంటారు. మైనస్ 20కి పైగా డిగ్రీలో చలిలో దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. హోలీ పండగ సందర్భంగా ఆదివారం నాడు సైనికులను కలుస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
కారకోరం రేంజ్‌లో 20 వేల అడుగుల ఎత్తులో సియాచిన్ హిమానీనదం ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన మిలిటరీ జోన్‌గా పేరు గాంచింది.





