News

విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్‌ ట్రయంప్‌’ సాగర విన్యాసాలు

193views

భారత్‌, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్‌ ట్రయంప్‌’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్‌ సోమర్సెట్‌’ విశాఖ తీరానికి చేరుకుంది. ఇది ఉభయచర యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది. దాదాపు 25 భారీ యుద్ధ ట్యాంకులు, నాలుగు యుద్ధ హెలికాఫ్టర్లు, నౌకకు అన్ని వైపులా ఆయుధ ట్యాంకులు, వెయ్యి మంది సిబ్బంది ఇందులో ఉండటం విశేషం. 2001 సెప్టెంబరు 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 93మంది స్మారకంగా ఈ నౌకను నిర్మించారు. విపత్తుల సమయంలో రక్షణ దళాలు ఈ నౌకను ఆసుపత్రిగా తీర్చిదిద్దిన కారణంగా అత్యాధునిక యుద్ధనౌకలలో ఒకటిగా ఇది చరిత్రలో నిలిచిపోయిందని నేవీ వర్గాలు వివరించాయి.