
273views
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామిని వివిధ దేశాలకు చెందిన భక్తులు బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. అమెరికా, కెనడా, యూకే, నెదర్లాండ్, జర్మనీ, రష్యా దేశాలకు చెందిన 46 మంది భక్తులు స్వామివారి దర్శనార్థం విచ్చేయగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆశీర్వాద మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం ఇప్పించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.





