
214views
దేశంలో పలు తీర్ధయాత్రా, పర్యాటక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ఈ రోజు కశ్మీర్ పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా రూ.1,325.76 కోట్ల విలువైన 52 ప్రాజెక్టులను శ్రీనగర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించి కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి ‘ప్రసాద్’ పథకం కింద అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’ నిధుల ద్వారా అన్నవరం దేవస్థానికి రూ. 20 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టబోయే పనులకు ప్రదాని వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నిధులతో ఆలయంలో నిత్యాన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, టాయిలెట్స్ బ్లాక్ వంటివి నిర్మాణం చేస్తారు.





