News

మహాశివరాత్రి దృష్ట్యా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

333views

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కర్నూలు ప్రజా రవాణాధికారి శ్రీనివాసులు తెలిపారు. కాలినడకన శ్రీశైలానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కర్నూలు-వెంకటాపురం మధ్య బస్సులు ఏర్పాటుచేశామని.. టికెట్‌ రూ.150గా నిర్ణయించామన్నారు. ఆదోని-శ్రీశైలానికి 79 బస్సులు కేటాయించగా టికెట్‌ ధర రూ.500గా ఉందని చెప్పారు. ఎమ్మిగనూరు నుంచి 5 బస్సులు నడుస్తాయని.. టిక్కెట్‌ ధర రూ.450 అని చెప్పారు. కర్నూలు-శ్రీశైలం మధ్య 136 బస్సులు (ధర రూ.350) నడుపుతున్నట్లు పేర్కొన్నారు. కోడుమూరు-శ్రీశైలానికి రూ.400, నందికొట్కూరు నుంచి రూ.300, ఆత్మకూరు నుంచి రూ.250, మహానంది నుంచి శ్రీశైలానికి టికెట్‌ ధర రూ.350గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కర్నూలు నుంచి జగన్నాథగుట్టకు 3 బస్సులు, ఎమ్మిగనూరు నుంచి గురజాలకు 12 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు