
టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆగష్టు 23. 1872 లో జన్మించారు. ఆయన సుప్రసిద్ధ స్వాతంత్య్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబంలో పుట్టి, ‘వారాలు’ చేసుకుని చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు.ప్రకాశం పంతులుగారు స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది, రచయిత, రాజకీయవేత్త, నటుడు.
టంగుటూరి ప్రకాశం పంతులుగారు జన్మించింది. వినోదరాయునిపాలెం, ఒంగోలు నుండి 26 కి.మీ దేరంలో ఉన్న వినోదరాయుని పాలెంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణ దంపతులకు జన్మించారు. ఆయనకు 11 సం॥ల వయస్సులో తండ్రి చనిపోయారు. తల్లి ఒంగోలు వచ్చి ఒక వసతి గృహాన్ని నిర్వహిస్తూ, అంటే భోజనహోటల్ నిర్వహించేవారు. బీదరికంలో వున్న ప్రకాశం వీధి దీపాల క్రింద చదువుకోవలసివచ్చేది. ఇమ్మానేని హనుమంతరావు గారు అనే ఉపాధ్యాయుడు ప్రకాశం గారిని రాజమహేంద్రవరంలో ఉన్నత విద్యాభ్యాసంలో చేర్పించారు. 1890 సం॥లో మెట్రిక్యులేషన్ అంటే ఇప్పటి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ప్రకాశం గారికి న్యాయశాస్త్రం చదవాలని అభిలాష ఉండేది. దాని కోసం మద్రాసు వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి, న్యాయవారిగా మద్రాసులో ప్రాక్టీసు ప్రారంభించారు. అప్పుడే సైమన్ కమీషన్ రాకకు నిరసన ప్రదర్శన జరిగింది. 31 ఏండ్ల వయస్సులోనే 1904లో రాజమండ్రి మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయనకు వెన్నుదన్నుగా ‘ఓగేటి రామకృష్ణయ్య’ గాని ఆర్థికంగా ఎంతో సహకరించారు. రాజకీయాల్లో ప్రతిపక్షంగా వున్న రామచంద్రరావు మద్దతునిచ్చారు.
ప్రకాశం పంతులు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక న్యాయవాది, ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళి బారిష్టర్ చదివివచ్చి న్యాయవాద వృత్తి చేపట్టారు. రాజమహేంద్రవరంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు వ్రాసిన గయోపాఖ్యానం నాటకంలో గయుడు, అర్జునుడుగా నటించారు.
భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మదనమోహన్ మాలవ్య నాయకత్వంలో చేరి దానికి రాజీనామా యిచ్చి, స్వతంత్ర పార్టీని స్థాపించారు. ‘దండి’ (ఉప్పు) సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీ గారితో కొంత విభేదించినా ఒక్కోసారి గాంధీగారు కూడా ఆయన మాట వినేవారు, ఆయనను ఒప్పించేవారు.
వారు 84 సం॥లు జీవించి, చివరకు 20 మే 1957న హైదరాబాదులో మరణించారు. అయితే ఆయన నివసించిన ఇల్లు ఒంగోలులో ‘ఐలండ్ విల్లా’ను ప్రభుత్వం ఆయన మెమోరియల్‌గా ఉంచలేకపోయింది. చివరకు ఆయన విగ్రహాలు మాత్రం మనకు స్ఫూర్తినిస్తూ వుంటాయి అనటంలో సందేహం లేదు.
వారి భార్య పేరు హనుమాయమ్మ. ఆమె భర్తకు తగిన భార్య. జీవితాంతం వారి అడుగుజాడల్లో నడిచింది.
వారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంను స్థాపించారు, ప్రకాశం బ్యారేజ్ ను కె.ఎల్. రావు గారి నేతృత్వంతో నిర్మించారు. 1972 డిసెంబరులో వారి గుర్తుగా అప్పటి ప్రభుత్వం ఒంగోలు జిల్లాను ప్రకాశం జిల్లాగా మార్చారు.
“రండిరా యిదే! కాల్చుకోండిరా”యని నిండు
గుండెలిచ్చిన మహోద్దండమూర్తి
పట్టింపు వచ్చెనా బ్రహ్మంతవానిని
గద్దించి నిలబెట్టు పెద్దమనిషి
తనకు నామాలు పెట్టిన శిష్యులను గూడ
ఆశీర్వదించు దయామయుండు
సర్వస్వము స్వరాజ్య సమరయజ్ఞమునందు
హోమమ్మొనర్చిన సోమయాజి
అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు
నమ్మికొల్చిన ఏకైక నాయకుండు
మన “ప్రకాశము” మన మహామాత్యమౌళి
సరిసములు లేని “ఆంధ్రకేసరి” యతండు!
– కరుణశ్రీ గారి ఉదయశ్రీ-3వ భాగము నుండి




