
ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తల హత్యాయత్నం కేసులో 10 మంది సీపీఎం కార్యకర్తలకు శిక్షపడింది. 2011లో జరిగిన ఒక బాంబు దాడి ఘటనలో, RSS-BJP కార్యకర్తలను హత్య చేయడానికి ప్రయత్నించినందుకు 10 మంది సీపీఎం కార్యకర్తలను కన్నూర్ లోని తాలిపరంబలోని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పు ఘటన జరిగిన 14 సంవత్సరాల తర్వాత వెలువడటం విశేషం.
ఈ నెల 17 న తాలిపరంబాలోని అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. హత్యాయత్నం, పేలుడు పదార్థాల చట్టం కింద సీపీఎం కార్యకర్తలు నేరాలకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంటూ.. వారిని దోషులుగా ప్రకటించింది.
ఈ కేసు 2011, నవంబర్ 27 నాటిది. ఆ రోజు తిమిరి అనే ప్రాంతం వద్ద సీపీఎం కార్యకర్తలు ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా బాంబు దాడికి దిగారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం బాధితులు ఆస్పత్రిలో చికిత్స తీసుకొని, తిరిగి వస్తుండగా సీపీఎం గూండాలు దాడికి దిగారు. ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా సీపీఎం గూండాలు నాటు బాంబులు విసిరారు. ఈ దాడిలో తొమ్మిది మంది ఆరెస్సెస్ బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
శిక్ష పడిన వారిలో తలిపరంబ తాలూకా సర్కిల్ సహకార సంఘం ఛైర్మన్ M.K. ప్రదీప్ కుమార్
అలకోడ్ గ్రామ పంచాయతీ సభ్యుడు మరియు మాజీ CPI(M) ఏరియా కార్యదర్శి P.V. బాబురాజ్
T.V. బిను, P.P. సత్యన్, E.V. వినోద్ కుమార్, పాలేరి విజయన్
K.P. సురేష్, టోబి, జనార్దనన్ మరియు శివప్రసాద్ వున్నారు.
అయితే, తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. అలాగే ఈ దాడి పూర్తిగా రాజకీయ కుట్రతో కూడుకున్నదని దర్యాప్తు అధికారులు కూడా పేర్కొంటున్నారు.




