
286views
‘మిలాన్-2024’ నేపథ్యంలో అంతర్జాతీయ నగర కవాతుకు ఆర్కే బీచ్ వేదికైంది. నౌకాదళం ఆధ్వర్యంలో గగన తలంలో, సముద్ర జలాల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అబ్బురపరచాయి. యుద్ధ సమయంలో ప్రదర్శించే వ్యూహాత్మక విన్యాసాలతో ‘హాక్ జెట్లు’ ఔరా అనిపించాయి. యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.

చేతక్ హెలికాప్టర్లు అద్వితీయ ప్రదర్శనతో వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సముద్రంలో చిక్కుకున్న మెరైన్ కమాండోలను చేతక్, యూహెచ్‌వీహెచ్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ల సహకారంతో, శత్రువుల చెరలో చిక్కుకున్న బాధితులను కాపాడే ఘట్టాన్ని ప్రదర్శించారు.







