
261views
శ్రీకాళహస్తీశ్వరాలయంలో జర్మన్ దేశీయులు రాహు, కేతు సర్పదోష నివారణ పూజలను చేయించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనార్థం వచ్చిన వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. క్రమశిక్షణతో క్యూలైన్‌లో వెళ్తూ దర్శనం చేసుకోవడం చూపరులను మరింతగా ఆకట్టుకుంది.దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల ఆశీర్వాదం పొందారు. అనంతరం ఆలయంలోని పొగడ చెట్టు వద్ద శివనామస్మరణ చేశారు.ముక్కంటి ఆలయ శిల్ప సౌందర్యం ఆకట్టుకుందని తెలిపారు.





