News

బ్యాడ్మింటన్‌లో భారత జట్టు స్వర్ణ చరిత్ర

241views

ఆసియా టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సెమిస్‌లో జపాన్ పై సంచలన విజయం సాధించిన భారత జట్టు.. ఆదివారం మలేషియాలోని షా ఆలమ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్ లాండ్ జట్టును ఓడించింది. 3_2 తేడాతో ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్ లో పీవీ సింధు, అన్మోల్ కర్బ్ దూకుడయిన ఆట తీరు ప్రదర్శించడంతో థాయ్ లాండ్ జట్టు తలవంచింది. ఆసియా టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించడం ఇది తొలిసారి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పీవీ సింధు, గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ, అన్మోల్ ఖర్బ్ అద్భుతమైన ప్రదర్శన చూపడంతో థాయ్ లాండ్ పై భారత జట్టు విజయం సాధించింది. బ్యాడ్మింటన్‌లో బలమైన జట్లైన చైనా, హాంకాంగ్, జపాన్ జట్లను ఓడించి ఫైనల్ చేరిన భారత జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ పై 3_2 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సాధించింది.

ఈ టోర్నీకి ముందు గాయంతో బాధపడి చికిత్స పొందిన పివి సింధు..ఫీనిక్స్ పక్షి లాగా పుంజుకుంది. తన పూర్వ ఆటను ప్రత్యర్థులకు పరిచయం చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో సుపనిందా కతే థాంగ్‌ను కేవలం 39 నిమిషాల్లో ఓడించింది. 21_12, 21_12 తేడాతో మట్టి కరిపించి భారత జట్టుకు 1_0 ఆధిక్యాన్ని అందించింది.

ఇక మూడు గేమ్‌ల పోరులో గాయత్రి గోపీచంద్, జాలీ ట్రిసా ద్వయం.. థాయ్ లాండ్ కు చెందిన జోంగ్ కోల్ఫామ్ కిటితారాకుల్, రవ్వింద ప్రజోంగ్ జల్ ద్వయాన్ని ఓడించింది..గాయత్రి గోపీచంద్, జాలీ ట్రిసా ద్వయం 5 మ్యాచ్ ల టై లో మొదటి డబుల్ మ్యాచ్‌లో థాయిలాండ్ జోడిని 21_16, 18_21, 21_16 తేడాతో ఓడించింది. చివరి గేమ్‌లో మాత్రం గాయత్రి గోపీచంద్, జాలీ ట్రిసా ద్వయం 6_11 తేడాతో వెనుకబడిపోయింది..

ప్రపంచ 472వ ర్యాంకర్ గా కొనసాగుతున్న 16 సంవత్సరాల అన్మోల్ ఖర్బ్ మ్యాచ్‌లో విజృంభించాడు. ప్రపంచ 45వ ర్యాంకు క్రీడాకారుడు చోయి కీవాంగ్‌ను ఓడించాడు. భారత జట్టుకు నిర్ణయాత్మక విజయాన్ని అందించాడు. క్రీడా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకోవడం భారత జట్టుకు ఇదే తొలిసారి. ఇంత ప్రతిష్టాత్మకమైన థామస్ గెలుచుకున్న రెండు సంవత్సరాల తర్వాత భారత జట్టు చైనా, హాంకాంగ్, జపాన్, థాయ్ లాండ్ జట్లను ఓడించి స్వర్ణ చరిత్ర లిఖించింది.

అంతకుముందు శనివారం జపాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ హోరాహోరిగా పోరాడింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో సింధు తీవ్రంగా నిరాశ నేటి తరం ఆటగాళ్లు అన్ మోల్ కర్బ్, అస్మిత, గాయత్రి జోడి పట్టువీడకుండా పోరాడారు. జపాన్ పై 3_2 తేడాతో భారత్ విజయం సాధించింది. 2016, 2020 లో పురుషులు కాంస్య పత కాలు సాధించడమే ఇప్పటిదాకా ఈ ఈవెంట్లో భారత జట్టుకు అత్యుత్తమ ప్రదర్శన. చివరి సింగిల్స్‌లో బరిలోకి దిగిన హర్యానాకు చెందిన 17 సంవత్సరాల అన్‌మోల్ 21_14, 21_18 తేడాతో వరల్డ్ 29వ ర్యాంకర్ నట్సుకి నిడైరా కు షాక్ ఇచ్చింది. టీమిండియా ఫైనల్ వెళ్ళింది.