News

బాపట్ల నుంచి భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణానికి గోటికోటి తలంబ్రాలు

308views

బాపట్ల జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామ భక్త సేవా సమితి ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలోని శ్రీసీతారాముల కళ్యాణానికి గోటికోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు మరోసారి అవకాశం దక్కింది. ఈ సందర్భంగా శ్రీ రఘురామ భక్త సేవా సమితి ప్రతినిధులు భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి చేతుల మీదుగా అనుమతి పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ గత పది ఏళ్ళుగా శ్రీరామనవమికి శ్రీసీతారాముల వారి కల్యాణంలో మహోత్సవానికి వినియోగించే గోటి కోటి తలంబ్రాలను చీరాల నుంచి సిద్ధం చేస్తున్నామన్నారు.ఈక్రమంలోనే ఈ ఏడాది కూడా గోటితో వలిచే తలంబ్రాలను సిద్ధం చేసేందుకు దేవస్థానం నుంచి అనుమతి పొందడం జరిగిందన్నారు. ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే అదృష్టం కలగటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు .