
ఈనెల 4వ తేదీన నెల్లూరులోని విఆర్ కాలేజీ మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నెల్లూరు నగర సాంఘిక్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాందేవ్ బాబా దేవాలయ మాజీ అధ్యక్షులు కేశవరామ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు.అలాగే ఈ కార్యక్రమంలో మాననీయ ప్రాంత సంఘచాలక్ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి , మాననీయ విభాగ్ సంఘచాలక్ పల్నాటి రామదండు, మాననీయ నగర సంఘచాలక్ డాక్టర్ సి.వి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు.

ముఖ్య అతిధి కేశవరామ్ మాట్లాడుతూ.. సంఘ సాంఘిక్ కు రావడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన వక్త బయ్యా వాసు మాట్లాడుతూ హిందూ సంఘటన కొరకు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురించి డాక్టర్ హెగ్డేవార్, గురూజీల అవిరాళ కృషి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరియు ఇతర సంఘ కార్యకర్తల గురించి గుర్తుచేసుకున్నారు. ప్రతి కార్యకర్త ఒక కరెంట్ అకౌంట్ లాగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అమృతకాలంలో రాబోయే సంఘ శత జయంతి సందర్భంగా ప్రతి కార్యకర్త గ్రామీణ వికాసం కొరకు, పర్యావరణహితంగా, సామాజిక సమరసతతో, విలువలతో కూడిన జీవన పద్ధతిని అలవర్చుకోవాలని తెలియజేశారు. ఈ సాంఘిక్ లో 41 బస్తీల నుండి 1923 మంది స్వయం సేవకులు గణవేశ్ లో పాల్గొన్నారు. వీరితో పాటుగా 221 మంది (173 మంది స్వయం సేవకులు, 48 మంది మాతృమూర్తులు) కార్యక్రమంలో పాల్గొన్నారు.





