
300views
బాపట్ల జిల్లాలోని పర్చూరు చినగంజాంలో శ్రీరాముల వారి గోటి కోటి తలంబ్రాల కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురువారం పర్చూరులోని వేణుగోపాలస్వామి ఆలయంలో కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణా రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరు గ్రామానికి చెందిన రామదాసు తిరుపతి, తిరుపతమ్మ దంపతులు రసాయన ఎరువులను వినియోగించకుండా పండించిన ధాన్యాన్ని ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే స్వామి వారి కల్యాణానికి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. ఆ ధాన్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు పంపించి మహిళల గోళ్లతో ఒలిపిస్తారు. ఈ క్రమంలో అక్కడి నుంచి పర్చూరు రామాలయానికి బుధవారం 140 చిన్న ధాన్యపు ప్యాకెట్లు చేరుకున్నాయి. రామాలయంలో వీటిని ఒలిచే కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.





