News

వ్యాస్‌జీ మందిరంలో పూజలపై హైకోర్టులో మసీదు కమిటీ పిటిషన్‌

383views

వ్యాస్‌జీ మందిరంలో పూజల నిర్వహణకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేసింది. మసీదు కమిటీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను కలిసి సత్వరమే కేసు విచారణకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్‌.. సీజేఐ దృష్టికి తీసుకెళ్లగా.. అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. జిల్లా యంత్రాంగం అవతలి పక్షంతో కుమ్మక్కై వెంటనే పూజలు ప్రారంభమయ్యేలా చేసిందని మసీదు కమిటీ ఆరోపించింది. ఈ మేరకు అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.