News

ఫిబ్రవరి 8 నుంచి పురంధరదాసు ఆరాధనా మహోత్సవాలు

322views

కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహించనున్నారు. చివరిరోజు ఫిబ్రవరి 10న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ఫిబ్రవరి 7న తిరుమలలోని కల్యాణవేదికలో యువ కళాకారులతో ‘శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక్ఙ గోష్టిగానం నిర్వహించనున్నారు.

కళాకారులకు ‘యువ ప్రతిభ పురస్కారాలు’
సంగీత, నృత్య, వాద్య రంగాలలో నిష్ణాతులైన యువ కళాకారులకు ఈ ఏడాది మొదటిసారిగా టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీయువ ప్రతిభ పురస్కారాలు’ అందజేయనున్నారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.