
పాక్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల హత్యతో భారత ఏజెంట్లకు సంబం ధాలు ఉన్నాయని చెప్పేందుకు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని పాకిస్థాన్ గురువారం ఆరోపించింది. జైషే మహమ్మద్, లష్కరే తయిబా సంస్థలకు చెందిన ఈ ఇద్దరు ఉగ్రవాదులు గతేడాది సియాల్కోట్, రావల్కట్లలో హతమయ్యారు. పాక్ లో చొరబడి ప్రాదేశిక, న్యాయపరమైన హద్దులను అధిగమించి భారత్ హత్యలకు పాల్పడుతోందని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి మహమ్మద్ సైరస్ సజ్జాద్ ఖాజి మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలను ద్వేషంతో కూడిన తప్పుడు ప్రచారంగా భారత్ గట్టిగా ఖండించింది. భారత వ్యతిరేక ప్రచారంలో ఇది పాకిస్థాన్ తాజా ఎత్తుగడగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పాక్ తాను విత్తిన ఉగ్రవాద ఫలాలనేఇపుడు అనుభవిస్తోందని, దీనికి ఇతరులను నిందించడం పరిష్కారం కాదన్నారు. ఉగ్రవాదా నికి పాకిస్థాన్ ఏవిధంగా స్థావరమైందో ప్రపంచ మంతా తెలుసని, దీనిపై భారత్ తో సహా పలు దేశాలు పాక్ను బహిరంగంగా హెచ్చరించిన విష యాన్ని ఆయన గుర్తు చేశారు.
■ జైషే చీఫ్ మసూద్ అజర్కు ప్రధాన అనుచరుడైన షాహిద్ లతీఫ్ ను గతేడాది అక్టోబరు 11న సియాల్ కోట్లోని మసీదులో కాల్చిచంపారు. భారత్ లో పఠాన్ కోట్ వాయుసేన స్థావరంపై 2016లో జరిగిన దాడికి వ్యూహకర్త ఇతడు. అలాగే సెప్టెంబరు 8న పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్ కోట్ మసీదులో జరిగిన మరో ఘటనలో లష్కరే తాయిబా ఉగ్రవాది రియాజ్ అహ్మద్ అలి యాస్ అబు ఖాసింను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. గతేడాది జనవరి 1న జమ్మూకశ్మీర్లోని డాంగరీలో జరిగిన ఉగ్రదాడుల వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుల్లో రియాజ్ ఒకడు.





