
శ్రీ రామ జన్మభూమి విముక్తి కొరకు తమ సర్వస్వాన్ని అర్పించిన రామ భక్తులలో పరమ పూజనీయ శ్రీ గోపాల్ సింగ్ విశారద్, శ్రీ దేవకీనందన్ అగర్వాల్, శ్రీ ఠాగూర్ గురుదత్త సింగ్, శ్రీ ఠాగూర్ గురుదత్త సింగ్, శ్రీ దావుదయాళ్ ఖన్నా వంటి వారు ఎందరో ఉన్నారు. శ్రీ రామ జన్మభూమి విముక్తి పోరాటంలో ప్రధాన వ్యక్తుల గురించి ఈ కధనంలో తెలుసుకుందాం.
శ్రీ గోపాల్ సింగ్ విశారద్
అయోధ్యలో నివసించిన ఒక రామభక్తుడు, న్యాయవాది. డిసెంబర్ 22, 1949 రాత్రి ఒక దైవిక అద్భుతం జరిగింది.అయోధ్యలో ప్రభువు శ్రీరాముడు దర్శనం ఇచ్చాడు.ఈ దివ్య వరం పొందిన మరుసటి రోజు, గోపాల్ సింగ్ విశారద్ కృషికి ప్రతిఫలంగా, జనవరి 5, 1950న, ఫైజాబాద్ న్యాయస్థానం నుంచి విగ్రహాలను తొలిగించవద్దనే ఉత్తర్వులు ప్రభుత్వానికి జారీ చేయబడ్డాయి.ఈయన అయోధ్య వివాదానికి సంబంధించిన వ్యాజ్యంలోని అసలు వాది.
శ్రీ దేవకీనందన్ అగర్వాల్
జస్టిస్ దేవకీనందన్ అగర్వాల్ సహకారంతోనే శ్రీరామ జన్మభూమి పోరాటంలో నిఖార్సైన నిజాలు నిరూపితం అయ్యాయి.పదవి విరమణ తర్వాత ఆయన రామ్‌లల్లాకి స్నేహితుడిగా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసి ఏమన్నారంటే..వివాదాస్పద స్థలంలోనే శ్రీరామ్‌లల్లా ఆసీనుడై ఉన్నందున శ్రీరామ్లల్లాను కేసులో పార్టీగా చేర్చాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పరిణామం తర్వాత హైకోర్టు రామ్‌లల్లా విగ్రహాన్ని పార్టీలో చేర్చింది. అయోధ్య వివాదానికి సంబంధించి 5 కేసులు నమోదు అయ్యాయి. అందులో చివరి మరియు 5వ కేసును భగవాన్ శ్రీరామ్‌లల్లా తరపున 1 జూలై 1999న దేవకీ నందన్ అగర్వాల్ దాఖలు చేశారు.
సనాతన ధర్మం అనుసారం ప్రాణ ప్రతిష్ఠిత మూర్తి ఒక సజీవుడు. మరియు తన కేసులో పోరాడవచ్చు. కానీ రాంలల్లా బాలస్వరూపంలోనే ఉన్నాడు. అందువల్ల రాముడి స్నేహితుల అవసరం ఏర్పడింది.అందుకే దేవకీ నందన్ అగర్వాల్ భగవాన్ శ్రీరాముడి తరపున స్వయంగా రాముడి స్నేహితుడిగా సమర్పించుకోవడం జరిగింది. (దేవకీ నందన్ అగర్వాల్ ద్వారా దాఖలు చేసిన దావాను అనుసరించి రామజన్మభూమి ప్రాంగణం మొత్తం వాది శ్రీరాంలల్లాకు చెందినదిగా న్యాయస్థానం అంగీకరించింది.
శ్రీ ఠాగూర్ గురుదత్త సింగ్
ఠాగూర్ గురుదత్త సింగ్ 1949లో ఫైజాబాద్ నగర మెజిస్ట్రేట్‌గా ఉన్నారు. 22 డిసెంబర్ రాత్రి ప్రభువు రామ్‌లల్లా దర్శనం యొక్క దివ్య సంఘటన జరిగింది. ఆ మరుసటి రోజు ఉదయం ఠాగూర్ గురుదత్త సింగ్..రాంలల్లా దర్శించుకుంటున్నారు. మరియు భవ్యమైన రామ మందిరం కోసం రాంలల్లాను ప్రార్థిస్తూ ఉన్నారు. ఏదైతే వివాదాస్పద కట్టడం కూల్చివేయబడిందో దాని గర్భగృహంలో రాంలల్లాతో పాటు గురుదత్త సింగ్ చిత్రపటం కూడా ఉంది.
శ్రీ దావుదయాళ్ ఖన్నా
రామ మందిరం కోసం ప్రజలను మేల్కొల్పడంలో శ్రీ దావుదయాళ్ ఖన్నా ముఖ్యమైన పాత్ర పోషించారు.శ్రీ రామజన్మ భూమి ముక్తి యజ్ఞ సమితి ప్రధాన కార్యదర్శి దావుదయాళ్ ఖన్నాకు 1983లో విశ్వహిందూ పరిషత్‌తో పరిచయం ఏర్పడింది. 18 జూన్ 1984లో శ్రీరామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి స్థాపించబడింది.గో రక్ష పీఠం మహంతులు శ్రీ అవైద్యనాథ్ దీనికి అధ్యక్షులుగా ఉండగా శ్రీ దావుదయాళ్ ఖన్నా సమితి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.సెప్టెంబర్ 25, 1984న దావుదయాళ్ ఖన్నా నేతృత్వంలో బీహార్‌లోని సీతామణి నుండి అయోధ్య వరకు రథయాత్ర జరిగింది.
శ్రీ రామ జన్మభూమి విముక్తి కోసం మరియు రామ కార్యం కోసం ఎవరైతే తమ శరీరం, మనస్సు మరియు సంపదలతో పాటు పూర్తి జీవితాన్ని అంకితం చేశారో ఈ రామభక్తులందరికీ కోటానుకోట్ల వందనాలు.





