
289views
ఈనెల 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలనీ ప్రధాని నరేంద్ర మోది సూచన మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బంగారమ్మ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలలో బిజెపి నేతలు ఈరోజు ఉదయం స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలనీ ప్రధాని నరేంద్ర మోది సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ 500 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న శుభపరిమాణం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుందని, అయోధ్య రామచంద్రయ్య ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహింపబడనుందన్నారు. యావత్ ప్రపంచంలోని హిందువులందరికీ ఇది పెద్ద పండుగలాంటిదన్నారు.





