News

నెల్లూరులో పుస్తకాష్కరణ సభ.

955views

కీ.శే. శ్రీ భోగాది దుర్గా ప్రసాద్ గారు ప్రముఖ సామాజిక సేవకులు. ఆరెస్సెస్ లో విశేష కృషి చేసిన శ్రీ దుర్గాప్రసాద్ గారు నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, విజయవాడ, గుంటూరులలో యువశక్తి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారు. జై ఆంద్ర ఉద్యమంలో కార్యకర్తలను పోలీసుల నుంచి రక్షించుటకై ఆ కాల్పులలో తానే బలైనారు. వారి సంస్మరణకై “శ్రీ భోగాది దుర్గాప్రసాద్ సంస్మరణ సమితి ఏర్పడి జాతీయ సాహిత్యాన్ని ప్రచురిస్తూ ఉన్నది.

అందులో భాగంగా దేవ దుర్లభ వీర వ్రతధారులు 1,2 భాగాలు, కర్మ వీరులు –  కార్య నిబద్దులు 1,2 భాగాలు, సామాజిక సమరసతా సాధన, రాణాప్రతాప్ పుస్తకాలను 30/6/2019 ఆదివారం నెల్లూరులోని రమేష్ రెడ్డి నగర్లో గల విజయ దుర్గ నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వడ్డీ విజయసారథి, ఆరెస్సెస్ ప్రాంత బౌద్దిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు, ఆరెస్సెస్ విభాగ్ సంఘచాలక్ మాననీయ రామదండు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భోగాది దుర్గాప్రసాద్ సంస్మరణ సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోడూరు సత్యం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.