News

తల్లీ కూతుళ్ళకు గుండు గీయించి గ్రామంలో ఊరేగించిన ముస్లిం ప్రజా ప్రతినిధి : బీహార్లో ఆలస్యంగా వెలుగుచూసిన మరో కీచక పర్వం

862views

బీహార్‌లో ఓ ముస్లిం ప్రజా ప్రతినిధి రెచ్చిపోయాడు.  కామాంధుడిలా ప్రవర్తించాడు.  ఇద్దరు మహిళలను ఘోరంగా అవమానించాడు. వైశాలి జిల్లాలోని బీహారి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం నాడు వార్డు మెంబర్ మహ్మద్ ఖుర్షిద్ కొందరు వ్యక్తులతో కలిసి అదే గ్రామానికి చెందిన ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో తల్లీకూతుళ్లు మాత్రమే ఉన్నారు. ఖుర్షిద్ ఆ ఇంట్లో ఉన్న 19 ఏళ్ల యువతిపై బలవంతంగా అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. సదరు యువతి తల్లి కూడా వారిని అడ్డగించింది. నన్నే ఎదిరిస్తారా? అంటూ వార్డు మెంబర్ ఆగ్రహావేశాలకు గురయ్యాడు. మీ అంతు చూస్తా అంటూ రెచ్చిపోయాడు. తల్లీకూతుళ్లకు గుండు కొట్టించడమే గాకుండా గ్రామంలో ఊరేగించాడు. అక్కడితో అతడి కోపం చల్లారలేదు. కాసేపటి తర్వాత తన అనుచరగణంతో మళ్లీ బాధితుల ఇంటికి వచ్చి నానా రచ్చ చేశాడు.

అత్యాచారం అడ్డుకున్నందుకే మీకు ఈ శిక్ష అంటూ ఆ తల్లీ కూతుళ్ళను దుర్భాషలాడుతూ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించాడు. తల్లీకూతుళ్లను కర్రలతో కొడుతూ బయటకు తీసుకొచ్చారు. వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అందరూ చూస్తుండిపోయారే కానీ ఎవరూ  ఆపే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగారు. వార్డు మెంబర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులకు గాను  ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదలావుంటే సదరు వార్డు మెంబర్ ఖుర్షిద్ పై యువతుల అక్రమ రవాణాతోపాటు పలు కేసులున్నట్లు తెలుస్తోంది.