News

ప్రపంచశాంతి కోసం బోధిసత్వుడి మార్గాన్ని అనుసరించాలి: దలైలామా

459views

ప్రపంచశాంతితోపాటు వ్యక్తిగత ఆనందం కోసం బోధిసత్వుడి విధానాలను అనుసరించాలని టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా పిలుపునిచ్చారు. బోధిసత్వుడి సూత్రాలను అనుసరించడం వల్ల తనకు వ్యక్తిగతంగా ఎంతో మేలు జరిగినట్లు ఆయన చెప్పారు. పాళి, సంస్కృతం.. వీటిలో ఏ సంప్రదాయంలో బౌద్ధాన్ని అనుసరిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరిలో కరుణను నింపాలని ఉద్బోధించారు. మనోవికాసాన్ని కలిగించే బోధిచిత్త ద్వారా బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని, అంతర్గత బలాన్నిచ్చే ఈ ప్రక్రియను సాధన చేస్తే కోపం, ద్వేషం, అసూయ తగ్గుతాయన్నారు. ‘సంప్రదాయాల అనుసంధానం, ఆధునికత స్వీకరణ’ పేరిట బుద్ధుని బోధనలపై అంతర్జాతీయ సంఘ వేదిక నిర్వహిస్తున్న మూడు రోజుల చర్చా కార్యక్రమాన్ని బుధవారం బోధిగయలో ప్రారంభించిన అనంతరం దలైలామా ఈ మేరకు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు వివిధ దేశాల నుంచి 2 వేల మందికి పైగా బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. ఈ నెల 23న మహాబౌద్ధ స్తూపం వద్ద ప్రపంచ శాంతి ప్రార్థన సమావేశంలో దలైలామా పాల్గొననున్నారు.