News

ఆవు పేడతో రాకెట్ ప్రయోగం సక్సెస్

302views

జపాన్ శాస్త్రవేత్తలు విప్లమాత్మక ప్రయోగాన్ని ఆవిష్కరించారు. ఆవు పేడతో స్పేస్ రాకెట్ ఇంజన్ ప్రయోగించి విజయం సాధించారు. ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయో మీథేన్‌తో జరిపిన పరీక్షలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఈ ఆవు పేడతో తయారు చేసిన ఇంధనంతో రాకెట్ భూమి నుంచి 100 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి, సురక్షితంగా భూమిపైకి దిగింది. హెకైడో స్పేస్ పోర్టు లాంచ్ కాంప్లెక్స్ ఈ పరీక్షలు నిర్వహించారు. సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ బయో మిథేన్ ఆధారిత ఇంజన్ల ఖర్చు చాలా తక్కువని జపాన్ స్పేస్ అధికారులు తెలిపారు.

జపాన్‌లోని ఇంజనీర్లు ఆవు పేడ నుండి సేకరించిన ద్రవ మీథేన్‌తో నడిచే కొత్త రాకెట్ ఇంజిన్‌ను ప్రయత్నించారు. జీరోగా పిలువబడే ఈ రాకెట్ ఇంజిన్ జపాన్‌లోని హక్కైడో స్పేస్‌పోర్ట్‌లో 10-సెకన్ల స్టాటిక్ ఫైర్ టెస్ట్”లో కిక్‌స్టార్ట్ చేశారు. జీరో ఒక చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ బయోమీథేన్ లేదా ఎల్బీఎం ద్వారా శక్తిని తయారువుతుందని, ఇది పశువుల ఎరువు నుండి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల కాలుష్యా ఉద్గారాతను తగ్గించవచ్చని, మారుమూల ప్రాంతాలలో ఇంధన సమస్యలను కూడా పరిష్కరిస్తుందని జపాన్ సంస్థ పేర్కొంది.