News

తిరుపతి గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం

256views

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో కార్తీక మాసంలో చివ‌రి ఆదివారాన్ని పురస్కరించుకొని తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వాన్ని నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 గంట‌ల‌కు ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి మూల‌వ‌ర్ల‌కు తిరుమంజ‌నం నిర్వ‌హించారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ఉభ‌య‌నాంచారుల‌తో క‌లిసి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆంజ‌నేయ‌స్వామివారి స‌న్నిధికి వేంచేపు చేసి ఏకాంతంగా తిరుమంజ‌నం చేపట్టారు. అక్క‌డ ఆస్థానం అనంత‌రం ఉభ‌య‌నాంచారుల‌తో కూడిన‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆల‌య మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యానికి తీసుకెళ్ళారు.