
234views
గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందిని ఈ నెల మూడున ఖతార్‌లోని భారత రాయబారి కలిశారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ఖతార్ కోర్టులో భారత ప్రభుత్వం అప్పీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఈ కేసులో ఇప్పటివరకు రెండుసార్లు విచారణ జరిగింది. మేం ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. బాధితులకు న్యాయపరమైన, దౌత్యపరమైన సహకారం కొనసాగుతుంది. డిసెంబర్ మూడున మన రాయబారి వారిని కలిశారు’ అని బాగ్చి వివరించారు.





