News

అనుమానిత గజ్వా-ఏ-హింద్ స్థావరాలపై ఎన్ఐఏ దాడులు, భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతున్నట్లు వెల్లడి

209views

దేశవ్యాప్తంగా అనుమానిత గజ్వా-ఏ-హింద్ స్థావరాలపై జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించింది. మధ్యప్రదేశ్ లోని దేవాస్, గుజరాత్లోని గిర్ సోమ్నాథ్, యూపీలో ఆజమ్గఢ్, కేర ళలోని కోజికోడ్లోని ఈ దాడులు జరిగాయి. సోదాల్లో పలు రహస్య పత్రాలు, డిజిటల్ పరికరాలను ఎన్ఏఐ స్వాధీనం చేసుకుంది. అనుమాని తులు.. పాకిస్థాన్తో నెరపుతున్న సంబంధాలకు సంబంధించి సాక్ష్యాలు కూడా లభ్యమయ్యాయని ఎన్ఐఏ పేర్కొంది. దేశానికి వ్యతిరేకంగా వీరంతా గజ్వా-ఏ-హింద్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది జులైలో బిహార్ పోలీసులు మర్గూబ్ అహ్మద్ దానిష్ అలియాస్ తాహిర్ను అదుపులో తీసుకున్నారు. గజ్వా-ఏ- హింద్ పేరుతో నడుపుతున్న వాట్సప్ గ్రూపునకు అడ్మినిస్ట్రేటర్ గా తాహిర్ పనిచేస్తున్నారని విచారణలో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.