News

తిరుమల వైకుంఠద్వార దర్శన టోకెన్లను జారీ చేయనున్న టిటిడి

354views

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠద్వార దర్శన టోకెన్లను మంజూరు చేసేందుకు టిటిడి సన్నద్ధమైంది. వైకుంఠ ఏకాదశికి లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టిటిడి ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా ఈనెల 10వతేదీ 2లక్షల 25వేల టోకెన్లను జారీ చేసింది. ఆన్ లైన్ టోకెన్లన్నీ భక్తులు బుక్ చేసుకున్నారు. తిరుపతిలోని టిటిడి కౌంటర్ల ద్వారా
డిసెంబర్ 23వతేదీ నుంచి టోకెన్లను జారీ చేస్తున్నట్లు టిటిడి ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎం.ఆర్.పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, రామచంద్ర పుష్కరిణిలోని కౌంటర్ల వద్ద 4లక్షల 23వేల 500టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. జవనరి 1వతేదీ నుంచి 10వతేదీ వరకు 10రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని టిటిడి ఈఓ తెలిపారు.