News

అమర్నాథ్‌ యాత్రికులకు శుభవార్త

259views

హిమాలయాల్లోని ప్రసిద్ధ క్షేత్రం అమర్నాథ్‌ యాత్రికులకు శుభవార్త..! ఇకపై యాత్రికులు అమర్నాథ్‌ గుహ వరకు వాహనాల్లో వెళ్లవచ్చు. గతంలో అమర్నాథ్‌కు చేరుకోవాలంటే.. గందేర్బల్‌ జిల్లాలోని బల్తాల్‌ బేస్‌ లేదా అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహల్గాం బేస్‌ నుంచి కాలి నడకన గానీ, గుర్రాలు, గాడిదలు, డోలీలు, హెలికాప్టర్లపైగానీ వెళ్లాల్సి వచ్చేది. జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత.. భక్తుల సౌకర్యార్థం బల్తాల్‌ బేస్‌ నుంచి అమర్నాథ్‌ వరకు రోడ్డును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో సంకల్పించింది. ఆ వెంటనే బీఆర్వో వర్గాలు పనులను ప్రారంభించాయి. 13 నెలల కాలంలో బీఆర్వో ఈ రోడ్డును నిర్మించగా.. సోమవారం తొలిసారి పలు మోటారు వాహనాలను బల్తాల్‌ బేస్‌ నుంచి అమర్నాథ్‌ గుహ వరకు తీసుకెళ్లారు.