News

అయ్యప్ప మాలధారుడిపై ముస్లిం యువకుల దాడి.. ఆపై వేధింపులతో ఆత్మహత్య

458views

నెల్లూరు జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. రౌడీ మూక దాడి తీరుతో మనస్తాపం చెంది అయ్యప్ప మాలాధారణలో ఉన్న వినయ్ అనే యువకుడు బుచ్చిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరులో వినయ్, వంశీలపై షబ్బీర్, మున్నా, మోనాఫ్, ఫరూఖ్ అనే ముస్లిం యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి సమయంలో అక్కడే ఉండి కూడా కనీసం పోలీసులు అడ్డుకోవడంలో విపలమైయ్యారని.. ఆ తరువాత కూడా రౌడీలకు మద్దతుగా నిలుస్తూ.. బాధితులని పోలీస్ స్టేషన్‌కి తరలించి వేధింపులకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులు షబ్బీర్, మున్నా, మోనాఫ్, ఫరూఖ్ పై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ఆందోళన చేస్తున్నారు