News

ఐరాసలో ‘వసుదైక కుటుంబం’ … భారత దౌత్య కార్యాలయం ఆవరణలో పలకం ఆవిష్కరణ

391views

ప్రపంచ ఐక్యత, అంతర్జాతీయ సహకారంపై భారతదేశం నిబద్ధతను తెలియజేస్తూ ఐక్యరాజ్యసమితిలోని భారత దౌత్య కార్యాలయం ఆవరణలో ‘వసుదైక కుటుంబం’ ఫలకాన్ని ఏర్పాటు చేశారు.

బంగారు వర్ణంలోని ఈ ఫలకాన్ని ఐరాసలో భారత రాయబారి రుచిరా కంబోజ్‌, భారత సాంస్కృతిక వ్యవహారాల మండలి(ఐసీసీఆర్‌) అధ్యక్షుడు డాక్టర్‌ వినయ్‌ సహస్రబుద్ధే ఆవిష్కరించారు. భారత దౌత్యకార్యాలయ ప్రవేశ ద్వారం లోపలి గోడపై ఈ ఫలకాన్ని ఏర్పాటు చేశారు. హిందీలో వసుధైక కుటుంబం అని, ఆంగ్లంలో ‘ది వరల్డ్‌ ఈజ్‌ వన్‌ ఫ్యామిలీ’ అని ఈ ఫలకంపై ముద్రించారు.