
కెనడాలో మధ్యప్రదేశ్ కి చెందిన దంపతులు ప్రఖ్యాత ఎల్లోరా కైలాశ్ గుహ నమూనాలో గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు నెలల పాటు శ్రమించి.. ఈ నమూనాను రూపొందించారు. దీనిని చూడడానికి భారతీయులతో పాటు కెనడా దేశస్థులు సైతం వస్తున్నారని ఆ దంపతులు చెబుతున్నారు.
ఇండోర్‌కు చెందిన అభిషేక్ పాఠక్, స్నేహల్ పాఠక్ దంపతులు కెనడాలో నివసిస్తున్నారు.వినాయక చవితిని వినూత్నంగా నిర్వహించాలని భావించిన దంపతులు.. ఎల్లోరాలోని కైలాశ్ గుహ నమూనాను మండపంగా రూపొందించారు. దీని ఏర్పాటు కోసం జూన్ నుంచి దాదాపు నాలుగు నెలల శ్రమించి.. కైలాశ్ గుహ నమూనాను రూపొందించారు. దీని తయారీకి అట్టలు, టీవీ డబ్బాలు, థర్మకోల్, టిష్యూ పేపర్లను ఉపయోగించారు. కైలాశ్ గుహకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను చూసి దీనిని చెక్కారు. వినాయక చవితి వేడకులను వినూత్నంగా చేస్తూ.. దేశంలోని ప్రఖ్యాత ప్రదేశాలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఇలా చేశామని తెలిపారు పాఠక్ దంపతులు.





