
319views
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.రాత్రి 7 నుండి 9 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.వచ్చే నెల 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్ధం అవుతోంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైభవోపేతంగా నిర్వహించింది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ముందుస్తు చర్యలు చేపట్టి విజయవంతం చేసింది. భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయంలోని పలు ఆర్జిత సేవలను టీటీడీ నిర్వహించింది.





