
270views
తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో కాపర్, స్టీల్ వాటర్ బాటిళ్ల విక్రయాలను ప్రారంభించింది. భక్తుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ బాటిళ్ల విక్రయం చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. తిరుమలలో అందుబాటులో ఉన్న కాపర్ బాటిల్ ధర రూ. 450, స్టీల్ బాటిల్ ధర రూ. 200 గా నిర్ణయించింది. ప్రస్తుతం వీటిని పద్మావతి విచారణ కార్యాలయంలో విక్రయిస్తున్నారు. భక్తుల స్పందన ఆధారంగా తిరుమలలోని అన్ని సబ్ ఎంక్వైరీ కార్యాలయాల్లో విక్రయాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.





