
తండ్రి మాట జవదాటని వాడు. నిత్యము సత్యము పలికేవాడు, ధర్మ మూర్తి ఆయన శ్రీరామచంద్రుడు సమస్త మాలవాళికి ఆదర్శ ప్రాయుడని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ ప్రచారఖ్ లక్ష్మణ్ అన్నారు. శ్రీరాముని బంటు ఆయన స్వామి హనుమ శోభాయాత్రలో కడప వాసులు పాలుపంచుకోవడం శుభపరిణామం అని అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూ చైతన్య వేదిక అద్వర్యంలో ఆదివారం కడప లో శోభాయాత్ర (బైక్ ర్యాలీ) కన్నుల పండువగా సాగింది. తొలుత మునిసిపల్ మైదానంలోని రాజరాజేశ్వరి గుడి ఎదుట హనుమంతునికి పూజలు నిర్వహించారు. జెండా ఊపి శోభాయాత్రను లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారతీయులు శ్రీరాముని వారసులమన్నారు. పుణ్య భూమి, వేదం భూమి అయిన భారత దేశం పట్ల పౌరులందరూ గౌరవభావాన్ని కలిగి ఉండాలి అన్నారు. సనాతన ధర్మం, గొప్పతనాన్ని గురించి వివరించారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వేలాది మంది హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబూని జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ బైక్‌లపై ముందుకు కదిలారు. అధిక సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని డీజే డాన్సులతో అందరిని ఆకట్టుకున్నారు. శోభాయాత్రలో పాల్గొన్న వారికి త్రాగునీరు, మజ్జిగ, ప్రసాదాలు అందించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ సహ కార్యవాహ వెంకటేష్, జిల్లా ప్రచారఖ్ వెంకట శేషు, జిల్లా శారీరక్ ప్రాముఖ్ శ్రీకాంత్, కడప నగర కార్యవాహ శ్రీనివాస్, నగర ప్రచార ప్రముఖ్ మురళీమోహన్ రెడ్డి, నగర వ్యవస్థ ప్రముఖ్ కులాయప్ప, నగర సేవా ప్రముఖ్ హరీష్, స్వ.సే లు వేణుగోపాల్, బాలాజీ, జగదీష్, హిందు చైతన్య వేదిక ప్రాంత యువ ప్రముఖ్ నీల కంటేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రవి, బీజేపీ నాయకులు లక్ష్మినాథ్ రెడ్డి, మునగా సతీష్, లక్మాన్ రావ్, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.






