News

అంగరంగ వైభవంగా గంగమ్మ తిరుణాల

212views

కడప జిల్లా కురబలకోట మండ లం తెట్టు సమీపంలో వెలసిన పాలేటి గంగ మ్మ తిరుణాలను అంగరంగ వైభవంగా నిర్వ హించారు. రెండు రోజుల పాటు నిర్వహిం చనున్న తిరుణాల గురువారం నుంచి ప్రా రంభం కానుండడంతో చుట్టు పక్కల ప్రాం తాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఆల యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వ హించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా తిరుణాలకు వచ్చే భక్త్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ చైర్మన ఆంజనేయులు సిబ్బంది ఏర్పాట్లను చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేశారు. విద్యుత దీపాలతో అలంకరించిన చాందినీ బండ్లను ఊరేగించారు. అలాగే రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌ తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అలాగే పలువురు భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు.