
186views
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వరుసగా సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటేత్తారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 85,450 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.





