
205views
తిరుమలలోని వసంతమండపంలో మూడురోజులుగా నిర్వహిస్తున్న శ్రీవారి వసంతోత్సవాలు బుధవారంతో ముగిశాయి. మూడోరోజు ఉదయం శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి, రుక్మిణీ సమేత కృష్ణస్వామి ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.





