
303views
జైనుల ఆరాధ్యదైవం మహావీరుని 2622 జయంతి వేడుకలను మంగళవారం నగరంలోని జైనులు భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్నారు. ఈసందర్భంగా పాతనగరంలోని నెహ్రూరోడ్డులోగల జైనుల దేవా లయంలో మహావీరుని విగ్రహానికి ఉదయం ప్రత్యేక పూజాదికాలు నిర్వహిం చారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంలో మహావీరుని చిత్రపటాన్ని పెట్టి, నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. జైన మహిళలు, పిల్లలు సంప్ర దాయ దుస్తులు ధరించి, మహావీరుని భజనలు, సంకీర్తనలు ఆలపిస్తూ ఈ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.





