News

ముగిసిన శంబర జాతర

225views

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర ఆఖరి వారం జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం వనం, చదురుగడుల్లో క్యూలైన్లలో భక్తజనం బారులుదీరి అమ్మవారిని దర్శించుకున్నారు. గోముఖీ నదీతీరంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది జనవరి 24న శంబర పోలమాంబ తొలిజాతర ప్రారంభమైన విషయం తెలిసిందే. భక్తుల రద్దీ దృష్ట్యా కొన్నాళ్లుగా పది వారాల పాటు జాతరను నిర్వహిస్తున్నారు. కాగా చివరి వారం సందర్భంగా వనంగుడి వద్ద దేవస్థానం ఈవో పి.రాధాకృష్ణ ఆధ్వర్యంలో చండీయాగం, నారాయణసేవ (మహా అన్నప్రసాద వితరణ ) నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్‌ పూడి దాలినాయుడు, ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.