News

ఘనంగా పెద్దమ్మతల్లి పండగ

254views

విజయనగరం జిల్లా సీతానగరం మండలం తామరకండి గ్రామంలో పెద్దమ్మతల్లి గ్రామ దేవత పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడురోజుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గ్రామంలో సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఘటాలను ఊరేగించారు. పరిసర ప్రాంత భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.