News

మత్స్యావతార మూర్తి శిరస్సుపై భాస్కరుడి తేజం

200views

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న సూర్యపూజ మహోత్సవాలు ముగిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భాస్కరుడి కిరణాలు మత్స్యావతార మూర్తి శిరస్సును తాకాయి. ధ్వజస్తంభం, రాజ గోపురాలను తాకుతూ వేద సంరక్షకుడి శిరస్సును తాకిన సూర్య కిరణాలను తిలకించిన భక్తులు గోవింద నామస్మరణలతో హోరెత్తించారు. సూర్యకిరణాలు ప్రవేశించిన మార్గంలో ఆలయ పరిచారకులు పుణ్య జలాన్ని వేదమంత్రాలతో చిలకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణస్వామి ఉత్సవర్లను తిరుచ్చిపై పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి హారతులు పట్టారు. తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తరువాత సర్వ భూపాల వాహనంపై అధిష్టింపజేసి తిరువీధి ఉత్సవం నిర్వహించారు.అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామివారికి ఏకాంత సేవ జరిపారు.