News

ఇరాన్‌ నౌకలో రూ. 425 కోట్ల డ్రగ్స్‌

255views

గుజరాత్‌లోని ఓఖా తీరప్రాంత సమీపంలో ఒక ఇరాన్‌ నౌక నుంచి భారత తీరప్రాంత రక్షణ బలగాలు(ఐసీజీ), గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) అధికారులు కలిసి 61 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 425 కోట్ల వరకూ ఉంటుందని ఐసీజీ ఒక ప్రకటనలో తెలిపింది. అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న సదరు నౌకపై నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు సోమవారం రాత్రి సమయంలో దాడి నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది.