News

వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

281views

బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పంచేడులో రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. గత వారం రోజులుగా జరుగుతున్న స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రఽథోత్సవం అత్యంత కనులపండువగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో గ్రామ వీఽధులు మార్మోగాయి. స్వామి, అమ్మవార్లు రథంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. పలువురు దాతలు భక్తులకు మజ్జిగ, మంచినీరు, ప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో ఉభయదాతలు బొమ్మా రమణారెడ్డి కుటుంబ సభ్యులు, బొమ్మా వంశస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మకర్త పెనాక ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షించారు. బుధవారం అశ్వవాహనసేవ, గురువారం ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.