News

ముగిసిన తెప్పోత్సవాలు

239views

తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్పపై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు.