News

మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు

198views

మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు నిర్వహించనుంది. ఆ సమయంలో ఆర్జిన సేవలను రద్దు చేసింది. ఇదే సమయంలో శ్రీవాణి దర్శన టికెట్ల కరెంట్ బుకింగ్ కోటా పెంచాలని నిర్ణయం తీసుకుంది.

తెప్పోత్సవాల్లో భాగంగా.. రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో శ్రీవారు, అమ్మవార్లు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి3,4 తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, 5,6 తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, 7న ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.

తెప్పోత్సవాల్లో మొదటి రోజు మార్చి 3న సీతా లక్ష్మణ ఆంజనేయ సమితంగా శ్రీరామచంద్ర మూర్తి అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. రెండో రోజు శ్రీ కృష్ణ స్వామి అవతారంలో మూడు సార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెలలోనే తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం, మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు, మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి, మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్థంతి. మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం కార్యక్రమాలు జరుగునున్నాయి.