News

ఆర్‌ఎస్‌ఎస్‌ రూట్‌ మార్చ్‌కు అనుమతులు ఇవ్వలేం – తమిళనాడు ప్రభుత్వం

372views

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్‌ తలపెట్టిన బహిరంగ ప్రదర్శనకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటించి ప్రదర్శనకు (రూట్‌ మార్చ్‌) అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నదని తన పిటిషన్‌లో వాదించింది. కోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరింది. అంబేడ్కర్‌ జయంతి, విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు అంతటా ప్రదర్శనలు, సభలు జరపాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయించింది. ఈక్రమంలో అక్కడి హైకోర్టు ఆర్‌ఎస్‌ఎస్‌ రూట్‌మార్చ్‌కు అనుమతులు ఇచ్చినా.. ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.