
15views
ఆదోని పట్టణంలోని గవి మఠం సంస్థానానికి చెందిన భూములను కాపాడాలని విరాట్ హిందూ సంస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆయన ఆదోనిలో పర్యటించారు. అనంతరం జిల్లా దేవదాయ శాఖ జిల్లా అధికారి మల్లికార్జున ప్రసాద్ను ఆ సంఘం నాయకులు కలిశారు. “సంస్థానానికి చెందిన భూముల్లో ప్లాట్లు వేసి విక్రయించారు. వీటికి సహకార బ్యాంకులో రుణాలిచ్చారన్నారు. మఠం చుట్టు పక్కల భూములకు సైతం ఓ వ్యక్తి పాసుపుస్తకాలు సృష్టించారు. మరో నాయకుడు శివారులోని ఇస్వీ రహదారిలో 12 ఎకరాల దాకా స్థలం ఆక్రమించారు. రూ.కోట్లు విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు” అని అధికారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అదికారి.. దీనిపై ఈ నెల 13న సర్వేకు ఆదేశించామన్నారు.





