News

జమ్మూకశ్మీరులో భూకంపం

254views

జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీరులోని కట్రా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. శుక్రవారం సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది.

ఈ భూకంపం వల్ల జమ్మూకశ్మీరులో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. కట్రా పట్టణానికి తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ నెల 13వతేదీన సిక్కింలో భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్ సంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.