
323views
మోపిదేవి(కృష్ణా జిల్లా) — గ్రామస్థులు, భక్తులు అందరూ సహకరిస్తేనే దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో రూ.కోటి 50 లక్షలతో చేపట్టిన పుష్కరిణి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన, భూమి పూజ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని మరింత విస్తరించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పుష్కరిణి అభివృద్ధి పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఆలయ అధికారులకు సూచించారు.




